కేసీఆర్ హయాంలో దేశంలోనే నెంబర్ వన్‌గా తెలంగాణ
ABN, Publish Date - Jan 12 , 2025 | 01:24 AM
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేసిన హయాంలో రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్‌గా ఎదిగిందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల వి ద్యాసాగర్‌రావు అన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
జగిత్యాల అగ్రికల్చర్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేసిన హయాంలో రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్‌గా ఎదిగిందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల వి ద్యాసాగర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఫార్ములా కేసుతో కేటీఆర్‌ను ఇబ్బందిపెట్టే ప్రయత్నం మానుకోవాలని, ఎన్ని అక్రమ కేసులు పెట్టిన ఎదుర్కోవడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిం దని, ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. ఆత్మగౌరవ చిహ్నాలను మార్చడం తప్ప అధికార కాంగ్రెస్ చేసిందేమి లేదన్నారు. రైతు రుణమాఫీ పూర్తికాలేదని, భరోసాను సైతం రూ. 15వేలు ఇస్తామని ప్రకటించి రూ,12వేలకే కుదించారన్నారు. హామీల అమలు, ప్రభుత్వ వైఫ ల్యాలపై ప్రశ్నిస్తున్నందునే మాజీ మంత్రి కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టే కుట్రలు చేస్తూ ప్రజల దృష్టిని మరల్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వరినాట్లు ప్రారంభం అయిన ఇంకా నీటి విడుదల చేయడం లేదని తక్షణమే రిజర్వాయర్‌లు నింపి, వాటి ద్వారా చెరువులు, కుంటలు నింపడంతో పాటు, ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందించాలన్నారు. అంతకుముందు జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ దావ వసంత సురేష్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 0.25టీఎంసీగా ఉన్న రోళ్లవాగు ప్రాజెక్టును 1టీఎంసీగా పెంపునకు బీజం వేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్ననాడు రోళ్లవాగును ఎందుకు ఆఽధునీకరించలేదని ఆమె ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు గట్టు సతీష్. ఆనందరావు, తేలు రాజు, బర్కం మల్లేష్‌యాదవ్, సాగి సత్యంరావు, చాంద్‌పాషా, నరేష్, వొడ్నాల జగన్, రమేష్, చందు, సత్యం తదితరులున్నారు. త
Updated Date - Jan 12 , 2025 | 01:24 AM