ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: హస్తినలో తెలంగాణ శోభ

ABN, Publish Date - Mar 06 , 2025 | 06:24 AM

ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అన్ని రాష్ట్రాల స్టాళ్లను సందర్శించారు. తెలంగాణ స్టాళ్లకు విచ్చేసిన రాష్ట్రపతిని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సాదరంగా ఆహ్వానించారు.

‘వివిధ కా అమృత్‌ మహోత్సవ్‌’లో రాష్ట్ర స్టాళ్లు

హాజరైన రాష్ట్రపతి, గవర్నర్‌, ఉప ముఖ్యమంత్రి

న్యూఢిల్లీ/సిరిసిల్ల, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): హస్తినలో తెలంగాణ శోభ వెల్లివిరిసింది. బుధవారం రాష్ట్రపతి భవన్‌లో వివిధ కా అమృత్‌ మహోత్సవ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అన్ని రాష్ట్రాల స్టాళ్లను సందర్శించారు. తెలంగాణ స్టాళ్లకు విచ్చేసిన రాష్ట్రపతిని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ చేనేత కళాకారుల పనితనాన్ని, చేతివృత్తుల ప్రాముఖ్యతను వివరించారు. అగ్గిపెట్టెలో పట్టేవిధంగా చేతితో చీర నేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నేత కళాకారుడు యెల్ది హరిప్రసాద్‌ పనితీరును రాష్ట్రపతి ప్రముఖంగా ప్రశంసించి, నేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 9 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో రాష్ట్రానికి చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీతలు గజం అంజయ్య, గజం గోవర్ధన్‌లు సహ 20 మంది వివిధ ప్రాంతాల ప్రముఖ చేనేత కార్మికులు, 20 మంది హస్తకళా నిపుణులు స్టాళ్లు ఏర్పాటు చేశారు.

Updated Date - Mar 06 , 2025 | 06:24 AM