ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High Court : జన్వాడ ఫాంహౌస్‌పై డ్రోన్‌ కేసు కొట్టివేయండి

ABN, Publish Date - Feb 04 , 2025 | 05:13 AM

తనపై ఉన్న రెండు కేసులను కొట్టివేయాలని కోరుతూ ముఖ్యమంత్రి దాఖలు చేసిన రెండు క్వాష్‌ పిటిషన్లను సోమవారం హైకోర్టు పరిశీలించింది. మాజీ మంత్రి కేటీఆర్‌కు చెందినదిగా పేర్కొంటున్న జన్వాడ ఫాంహౌజ్‌పై డ్రోన్‌ కెమెరా ఎగరేసిన

ఎస్సీ, ఎస్టీ కోర్టులోని కేసు కూడా...

హైకోర్టులో సీఎం రేవంత్‌రెడ్డి క్వాష్‌ పిటిషన్లు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): తనపై ఉన్న రెండు కేసులను కొట్టివేయాలని కోరుతూ ముఖ్యమంత్రి దాఖలు చేసిన రెండు క్వాష్‌ పిటిషన్లను సోమవారం హైకోర్టు పరిశీలించింది. మాజీ మంత్రి కేటీఆర్‌కు చెందినదిగా పేర్కొంటున్న జన్వాడ ఫాంహౌజ్‌పై డ్రోన్‌ కెమెరా ఎగరేసిన వ్యవహారంలో నార్సింగి పోలీసులు ఆయనపై 2020లో కేసు పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా జన్వాడ ఫాంహౌస్‌ కట్టారని ఆరోపిస్తూ ఆ భవనంపై రేవంత్‌రెడ్డి డ్రోన్‌ కెమెరా ఎగరేసి ఫొటోలు తీశారు. భూయజమానిని బెదిరించి 25 ఎకరాలు కొనుగోలు చేయడంతోపాటు జీవో 111 నిబంధనలను తుంగలో తొక్కి ఆ ఫాంహౌ్‌సను నిర్మించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. విలాసవంతమైన భవనం, ఈతకొలను, అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న ఫాంహౌస్‌ ఫొటోలు మీడియాకు విడుదల చేశారు. ప్రైవేటు ఆస్తిపై చట్టవిరుద్ధంగా డ్రోన్‌ ఎగరేశారని పేర్కొంటూ ఎయిర్‌క్రాఫ్ట్‌ చట్టం సహా పలు సెక్షన్ల కింద నార్సింగి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ పిటిషన్‌ను కొట్టేయాలని రేవంత్‌రెడ్డి 2020లోనే హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయగా అది తాజాగా విచారణకు వచ్చింది. రంగారెడ్డి ఎస్సీ, ఎస్టీ కేసుల స్పెషల్‌ కోర్టులో తనపై ఉన్న 2019 నాటి ఓ కేసును కొట్టేయాలని రేవంత్‌రెడ్డి మరో పిటిషన్‌ దాఖలు చేశారు. 2020లోనే ఈ పిటిషన్‌ దాఖలు చేయగా తాజాగా విచారణకు వచ్చింది. ఈ రెండు పిటిషన్‌లపై విచారణ చేపట్టిన జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం.. ప్రభుత్వం, ఫిర్యాదుదారులకు నోటీసులు జారీచేసింది. ఎస్సీ, ఎస్టీ కేసులో దిగువ కోర్టులో ప్రత్యక్ష హాజరు నుంచి రేవంత్‌ రెడ్డికి మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా పడింది.


ఇవి కూడా చదవండి..

KTR: రాష్ట్రంలో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. వేటు తప్పదా..


Gun Firing Case: రూ.333 కోట్లు.. వంద మంది యువతులే టార్గెట్.. వెలుగులోకి ప్రభాకర్ నేరాలు

Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకు కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 04 , 2025 | 05:13 AM