విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : ఎమ్మెల్యే
ABN, Publish Date - Jan 03 , 2025 | 12:33 AM
విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన సదుపాయాలు కల్పించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగో పాల్‌రెడ్డి అన్నారు.
చండూరు రూరల్, జనవరి2 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన సదుపాయాలు కల్పించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగో పాల్‌రెడ్డి అన్నారు. బోడంగిపర్తిలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. తరగతి గదులు, స్టోర్‌రూం, వంటగది, బాత్‌రూమ్, డ్రైనే జీలను పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఉదయం చన్నీళ్ళతో స్నానం చేసున్నారని అధ్యాపకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో సోలార్ హీటర్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కూరగాయలు, అన్నం, సాంబారు, వండిన కూరలను పరిశీలించారు. ప్రతి రెండు సంవత్సరాలకోసారి వంట పాత్రలు మార్చాలని సూచించారు. అన్ని గురుకులాల్లో టీచింగ్ స్టాఫ్, హాస్టల్ సిబ్బ ంది వేర్వేరుగా ఉండాలన్నారు. టీచింగ్ స్టాఫ్‌కే హాస్టల్ నిర్వహణ బాధ్యతలు ఉండ డంతో విద్యార్థులకు సరైన బోధన అందడం లేదని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో ఎంఈవో సుధాకర్‌రెడ్డి, కొరిమి ఓంకారం, మాజీ ఎంపీటీసీ పల్లె వెంకన్న ఉన్నారు.
Updated Date - Jan 03 , 2025 | 12:33 AM