ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శివకేశవులకు విశేష పూజలు

ABN, Publish Date - Jan 07 , 2025 | 12:45 AM

యాదగిరిగుట్ట లక్ష్మీన రసింహ స్వామి కొండపై శివకేశవులకు సోమవారం విశేష పూజలు కొనసాగాయి.

ధనుర్మాసోత్సవాల్లో పాల్గొన్న మహిళా భక్తులు

భువనగిరి అర్బన్‌, జనవరి 7 (ఆంధ్ర జ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీన రసింహ స్వామి కొండపై శివకేశవులకు సోమవారం విశేష పూజలు కొనసాగాయి. స్వయంభూ స్వామిఅమ్మవారికి శ్రీవైష్ణవ పాంచరాత్రాగమరీతిలో, పర్వతవర్థిని రామలింగేశ్వరస్వామి శివాలయంలో స్ఫటికమూర్తులకు శైవాగమశాస్త్ర రీతిలో నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ప్రధానాలయంలో సుప్రభాత సేవతో స్వామి అమ్మవారిని మేల్కొల్పిన అర్చకులు మూలమూర్తులను వేదమంత్ర పఠనాలు, పంచామృతాలతో అభిషేకించి, తులసి దళాలతో అర్చించారు. అష్టభు జి ప్రాకార మండపంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించిన పూజారులు విశ్వక్సేనుడికి తొలి పూజలు చేపట్టి సుదర్శన హోమం, నిత్య కల్యాణోత్సవం నిర్వహించారు. సాయంత్రం అలంకార వెండి జోడు సేవలు, సహాస్రనా మార్చ నలు ఆగమశాస్త్రరీతిలో కొనసాగాయి. శివాలయంలోని ముఖ మండపంలో స్ఫటికమూర్తును అర్చకులు వేదమంత్ర పఠనాలు, మంగళ వాయిద్యాల మధ్య పంచామృతాలతో అభిషేకించారు. శివపార్వతుల ఉత్సవ మూర్తులకు పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి తిరువీధుల్లో ఊరేగించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.20,69,197ల ఆదాయం సమకూరిందని ఈవో భాస్కర్‌రావు తెలిపారు. ధనుర్మాసోత్సవాలు 22వ రోజు వైభవంగా కొన సాగాయి. మహిళ భక్తులు అధికసంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

Updated Date - Jan 07 , 2025 | 12:45 AM