South Central Railway: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 57 రైళ్లకు అదనపు హాల్ట్‌లు
ABN, Publish Date - Feb 05 , 2025 | 05:28 AM
ఈ హాల్ట్‌లను ప్రయోగాత్మకంగా 6 నెలల పాటు అమలు చేస్తామని, అనంతరం కొనసాగించడంపై దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
ప్రయోగాత్మకంగా 6 నెలల పాటు అమలు
ప్రయాణికులు, నాయకుల విజ్ఞప్తి మేరకు అధికారుల నిర్ణయం
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వివిధ మార్గాల్లో నడుస్తున్న 57 రైళ్లకు అదనపు హాల్ట్‌లు కల్పిస్తున్నట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు. ఈ హాల్ట్‌లను ప్రయోగాత్మకంగా 6 నెలల పాటు అమలు చేస్తామని, అనంతరం కొనసాగించడంపై దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. భువనేశ్వర్- సికింద్రాబాద్ మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్, నాగర్‌సోల్- నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్, తిరుపతి- లింగంపల్లి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చే హైదరాబాద్ ఎక్స్‌ప్రె్‌సకు కొత్తగా సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికూడి , మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో హాల్ట్ కల్పించినట్లు తెలిపారు. అలాగే అంబేడ్కర్ నగర్- యశ్వంత్‌పూర్, నాగర్‌సోల్- చెన్నై, గోరఖ్‌పూర్- యశ్వంత్‌పూర్ మధ్య నడిచే ఎక్స్‌ప్రె్‌సలకు మహబూబ్‌నగర్‌లో, చెన్నై- అహ్మదాబాద్, సికింద్రాబాద్- హిస్సార్, హైదరాబాద్- రక్సాల్ మధ్య నడిచే ఎక్స్‌ప్రె్‌సలకు పెద్దపల్లి స్టేషన్‌లో, సికింద్రాబాద్- గుంటూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రె్‌సకు నెక్కొండలో హాల్ట్ కల్పించినట్లు చెప్పారు. గుంతకల్- హైదరాబాద్, జైపూర్- మైసూర్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గద్వాలలో, పూరి- తిరుపతి, బిలా్‌సపూర్- తిరుపతి, తిరుపతి- కాకినాడ టౌన్ మధ్య నడిచే ఎక్స్‌ప్రె్‌సలకు చినగంజాంలో హాల్ట్ కల్పించామని అధికారులు వెల్లడించారు. కాగా, ప్రయాణికులు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Updated Date - Feb 05 , 2025 | 05:28 AM