సమస్యలు పరిష్కరించి న్యాయం చేయండి
ABN, Publish Date - Feb 18 , 2025 | 12:56 AM
తమ సమస్యలను పరిష్క రించి న్యాయం చేయాలంటూ ప్రజలు ప్రజావాణిలో కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులను కలిసి విన్నవించారు. సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో ఏర్పా టు చేసిన ప్రజావాణిలో సమస్యలు చెప్పుకునేందుకు జిల్లా నలుమూల నుంచి ప్రజలు కలెక్టరేట్‌కు తరలిరావడంతో కిటకిటలాడిపోయింది.
సిరిసిల్ల కలెక్టరేట్, ఫిబ్రవరి 17 : (అంధ్రజ్యోతి), తమ సమస్యలను పరిష్క రించి న్యాయం చేయాలంటూ ప్రజలు ప్రజావాణిలో కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులను కలిసి విన్నవించారు. సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో ఏర్పా టు చేసిన ప్రజావాణిలో సమస్యలు చెప్పుకునేందుకు జిల్లా నలుమూల నుంచి ప్రజలు కలెక్టరేట్‌కు తరలిరావడంతో కిటకిటలాడిపోయింది. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కేంద్రంలో అద నంగా ఫిర్యాదులు వస్తున్న ఇందిరమ్మ ఇంటి దరఖాస్తుల కోసం ఈఈ చెన్నయ్య, జిల్లా ఇన్‌చార్జి పంచాయతీ అధికారి శేషాద్రిలకు ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ ప్రజావాణిలో 116 దరఖాస్తులు రాగా ఇందులో సిరిసిల్ల మున్సిపాల్టీకి 14, జిల్లా రెవెన్యూ శాఖకు 52, జిల్లా సంక్షేమాధికారికి 6, ఉపాధి కల్పన అధికారికి 6, కోనరావపేట ఎంపీడీవోకు 4, జిల్లావైధ్యాధికారికి 3,జిల్లా నీటిపారుదలశాఖకు 3, జిల్లా గ్రామీణాభివృద్ది శాఖకు 3, జిల్లా విద్యాశాఖకు 3, వ్యవసాయశాఖకు2, సెస్‌కు 2, ఎస్పీకార్యాలయాన్నికి 2, తంగళ్లపల్లి ఎంపీడీవోకు 2, అటవీశాఖకు 1, ఎస్టీసీకి1, అర్టీవోకు1, భూగర్జ మైనింగ్ శాఖకు1, ఏక్సైజ్‌శాఖకు1, అర్‌సీవోకు1, ఎస్సీ కార్పోరేషన్‌కు1, మత్యు శాఖకు 1, జిల్లా పౌరసరఫరాల శాఖకు1, వీర్నపల్లి ఎంపీడీవోకు1, చందుర్తి ఎంపీ డీవోకు 1, వేములవాడ ఎంపీడీవోకు 1, గంభీరావుపేట ఎంపీడీవోకు1, బోయిన పల్లి ఎంపీడీవోకు1 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి త్వరితగితన పరిష్కారం చూపాలన్నారు. డీఆర్‌డీవో శేషాద్రి, వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించండి
జిల్లాలో జీవిస్తున్న మాకు అద్దెకు ఉండేదుకు ఎవరూ ఇళ్లు ఇవ్వడం లేదని ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇండ్లను అందించడంతో పాటు తమకు సబ్సిడీపై వాహనాలను అందించాలని సోమవారం ట్రాన్స్ జెండర్లు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాను కలిసి విన్నవించడంతో పాటు అగ్రహారంలో తమ సం ఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఉచిత చలివేంద్రాన్ని ప్రారంభించాలని కోరారు.
గుడిపేట రామలింగేశ్వరస్వామి ఆలయానికి రోడ్డును నిర్మించండి
కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామశివారులోని గుడిపేట రామలింగేశ్వర స్వామి అలయంలో మహా శివరాత్రి సందర్భంగా జాతర జరు గుతుందని ఆలయానికి వెళ్లేందుకు సరైన రోడ్డు లేనందున రోడ్డు నిర్మించాలని అలాగే తాత్కాలిక రోడ్డు కోసం మోరం కోసం అనుమతులు ఇవ్వాలని గుడిపేట రామలింగేశ్వర స్వామిదేవాలయం కమిటీ చైర్మన్ కెతిరెడ్డి జగన్ మోహన్‌రెడ్డితో పాటు సభ్యులు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పించాలి
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని అలాగే బీసీలకు విద్య ఉద్యోగాల్లో జనాభా ప్రాతిపదికను రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీతోపాటు ప్లారమెంట్ సమావేశాల్లో తీర్మానాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసి దేశవ్యాప్తంగా బీసీ కులగణనను చేపట్టి సమగ్ర కుటుంబ కులగణన సర్వేను పారదర్శకంగా చేపట్టాలని బీసీ సాధికారత సంఘం నాయకులు సోమవారం జిల్లా కలెక్టరేట్‌కు తరలివచ్చి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీసీసాఽధికారిత సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొండ దేవయ్య, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పోలాస నరేందర్ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Feb 18 , 2025 | 12:56 AM