వివాహాది శుభకార్యాలకు ఆర్టీసీ అద్దె బస్సులు
ABN, Publish Date - Feb 06 , 2025 | 12:49 AM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రీజియనలోని అన్ని డిపోలలో వివాహాది శుభకార్యాలకు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ బస్సులు ఇవ్వనున్నట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా రీజనల్ మేనేజర్ కె.జానీరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వివాహాది శుభకార్యాలకు ఆర్టీసీ అద్దె బస్సులు
నల్లగొండ టౌన, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రీజియనలోని అన్ని డిపోలలో వివాహాది శుభకార్యాలకు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ బస్సులు ఇవ్వనున్నట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా రీజనల్ మేనేజర్ కె.జానీరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రీజియనలో పల్లె వె లుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను అద్దెకు తీసుకోవచ్చని పే ర్కొన్నారు. ప్రతి కిలోమీటరుపై గతంలో కంటే రూ.7 తగ్గింపు ఉందని, 6 గం టల వెయిటింగ్ చార్జీ మినహాయింపు ఉంటుందన్నారు. ప్రైవేట్ వాహనాల కన్నా తక్కువ ధరలకు బస్సులు వస్తాయని, డ్రైవర్ బత్తా ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన డ్రైవర్లతో పాటు సౌకర్యవంతమైన అధునాతన టెక్నాలజీ ఉన్న కొత్త బస్సులు చెప్పిన ఎన్ని గంటలకైనా అద్దెకు తీసుకోవచ్చని తెలిపారు. బస్సు బుకింగ్ చేసుకోవడానికి సమీప డిపోలను సంప్రదించాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు నల్లగొండ 99598 44918, సూర్యాపేట 7989225791, మిర్యాలగూడ 7382833790, కోదాడ 778043 3533, దేవరకొండ 7382833031, యాదగిరిగుట్ట 9885 103165, నార్కట్‌పల్లి 9848584198 నెంబర్లను సంప్రదించాలని కోరారు.
Updated Date - Feb 06 , 2025 | 12:50 AM