మొరాయించిన ఆర్టీసీ ఎలక్ర్టిక్ బస్సు
ABN, Publish Date - Jan 30 , 2025 | 01:19 AM
వరంగల్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న వరంగల్-2 డిపోకు చెందిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కొండగట్టు సమీపంలో బుధ వారం ఉదయం నిలిచిపోయింది.
జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో నిలిచిపోయిన ఆర్టీసీ ఎలక్ర్టిక్ బస్సు
మల్యాల, జనవరి 29(ఆంధ్రజ్యోతి): వరంగల్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న వరంగల్-2 డిపోకు చెందిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కొండగట్టు సమీపంలో బుధ వారం ఉదయం నిలిచిపోయింది. ఓ ప్రయాణికుడు మూత్రశాలకు వెళ్లడానికి నిలుపగా ప్రయాణికుడు వచ్చాక మళ్లీ బస్సు ఇంజన్ స్టార్ట్ చేసే క్రమంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ప్రయాణికులను మరో బస్సులో పంపించా రు. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టగా పలు చోట్ల సాంకేతిక లోపాలు ఏర్పడడం ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది.
Updated Date - Jan 30 , 2025 | 01:19 AM