ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహాశివరాత్రి ఏర్పాట్ల పరిశీలన

ABN, Publish Date - Feb 22 , 2025 | 11:40 PM

సీతారాంపల్లి గోదావరినది వద్ద మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లను అధికార యంత్రాంగం శనివారం సాయంత్రం పరిశీలించింది. తహసిల్దార్‌ శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమీషనర్‌ చిట్యాల సతీష్‌లు పుష్కర ఘాట్‌ వద్ద ఏర్పాట్లను పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.

నస్పూర్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి) : సీతారాంపల్లి గోదావరినది వద్ద మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లను అధికార యంత్రాంగం శనివారం సాయంత్రం పరిశీలించింది. తహసిల్దార్‌ శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమీషనర్‌ చిట్యాల సతీష్‌లు పుష్కర ఘాట్‌ వద్ద ఏర్పాట్లను పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఉదయం మున్సిపల్‌ ఏఇ మధు, ఎస్సై సుగణాకర్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ వేణులు పరిశీలించారు. పుష్కర ఘాట్‌ వద్ద షవర్లు ఏర్పాటు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాటు చేసిన గదులను శుభ్రం చేయించారు. సీసీసీ కార్నర్‌ వద్ద నుంచి పుష్కర ఘాట్‌ వరకు ఉన్న రోడ్డుకు ఇరువైపుల ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి చదును చేయించారు. పరిసర ప్రాంతాలు చెత్త చెదారం లేకుండా శుభ్రం చేయించారు. లైట్ల ఏర్పాటుతో పాటు వాహనాల పార్కింగ్‌, స్థలాన్ని పరిశీలించారు. మహాశిరాత్రి పర్వదినం సందర్భంగా వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం, వైద్య శిబిరాల ఏర్పాటు చర్చించారు. స్నానాలకు వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - Feb 22 , 2025 | 11:40 PM