ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వేరుశనగ ధర తగ్గించడంపై ఆందోళన

ABN, Publish Date - Feb 01 , 2025 | 11:32 PM

ధారూరు వ్యవసాయ మార్కెట్‌లో నిర్వహించిన బీట్లలో ఖరీదుదారులు వేరుశనగ ధరను తగ్గించడంపై శనివారం రైతులు ఆందోళనకు దిగారు.

మార్కెట్‌లో వేరుశనగ బీట్ల వద్ద ఆందోళన చేస్తున్న రైతులు

ధారూరు, పిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ధారూరు వ్యవసాయ మార్కెట్‌లో నిర్వహించిన బీట్లలో ఖరీదుదారులు వేరుశనగ ధరను తగ్గించడంపై శనివారం రైతులు ఆందోళనకు దిగారు. బీట్లను అడ్డుకుని ధరపెంచి కొనుగోలు చేయాలని వేరుశనగ రైతులు పట్టుబట్టారు. దీంతో మార్కెట్‌ అధికారి సిద్దమ్మ జోక్యం చేసుకుని అడ్తిదారులు, ఖరీదుదారులు, రైతులతో మాట్లాడి ఇతర మార్కెట్లలో వేరుశనగ ధరలను పరిశీలించి ధరను పెంచి కొనుగోలు చేయించారు.ఇతర మార్కెట్‌లలో ధరల కన్నా ఇక్కడి తగ్గించి కొనుగోలు చేస్తున్నారనరి, తమకు క్వింటాలుకు రూ. 6వేల పైన ధర పెడితేనే విక్రయిస్తామని లేకుంటే లేదని వేరుశనగ రైతులు భీష్మించారు. ధరను పెంచి కొనుగోలు చేయాలని మార్కెట్‌ అధికారి సిద్దమ్మ ఖరీదుదారులకు సూచించారు. అనంతరం జరిగిన బీట్లలో వేరుశనగ క్వింటాలుకు రూ. 6,200ల నుంచి రూ. 5,050ల వరకు ధర పలకటంతో రైతులు వేరుశనగ పంటను విక్రయించారు.

Updated Date - Feb 01 , 2025 | 11:32 PM