వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
ABN, Publish Date - Jan 11 , 2025 | 12:12 AM
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనలు పూడూరు, మేడ్చల్ పరిధిలో చోటుచేసుకున్నాయి.
పూడూరు, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనలు పూడూరు, మేడ్చల్ పరిధిలో చోటుచేసుకున్నాయి. లారీ ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన ఘటన పూడూరు మండలంలోని మిర్జాపూర్ గే టు సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ మధుసూదనరెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దుద్యాల మండల ం హిర్లపల్లి, మైసమ్మగడ్డ తండాకు చెందిన పాతలావాత్ సురేష్(22) ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. మన్నెగూడ వైపు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ సురేష్ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి ఆరు నెలల పాప ఉంది. మరో ఘటన మేడ్చల్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల్ల వీర్రేడ్డిపల్లికి చెందిన శ్రీశైలం(29) గురువారం రాత్రి మండలంలోని డబీల్‌పూర్ గ్రామ రైల్వే గేటు సమీపంలో బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. దీంతో తీవ్రగాయాలు కాగా అతను అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Jan 11 , 2025 | 12:12 AM