రెండు బైకులు ఢీ.. ముగ్గురికి గాయాలు
ABN, Publish Date - Jan 21 , 2025 | 12:04 AM
కళాశాలకు బైక్‌పై వెళ్లుతున్న విద్యార్థులు మరో బైక్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఘట్‌కేసర్ రూరల్, జనవరి 20(ఆంధ్రజ్యోతి): కళాశాలకు బైక్‌పై వెళ్లుతున్న విద్యార్థులు మరో బైక్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఘట్‌కేసర్ పోలీ్‌సస్టేషన్‌లో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బోగారంలోని హోలీమేరి కళాశాలలో సెకండియర్ చదువుతున్న చరణ్‌కుమార్, సత్యప్రకా్‌షలు సోమవారం ఉదయం కళాశాలకు బైక్‌పై వెళ్తుతుండగా కొండాపూర్ సమీపంలోని విజ్ఞాన్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఘట్‌కేసర్ వైపు వస్తున్న గులాం ఆహ్మద్, మహేశ్వర్ బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సత్యప్రకాష్ తలకు బలమైన గాయం కాగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Updated Date - Jan 21 , 2025 | 12:04 AM