ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దొంగ అరెస్ట్‌.. రిమాండ్‌

ABN, Publish Date - Jan 16 , 2025 | 11:26 PM

దేవాలయాలు, తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్న దొంగను గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. నందిగామ మండలం రంగాపూర్‌ గ్రామానికి చెందిన కొనిరెడ్డి వంశీ(23) డ్రైవర్‌.

షాద్‌నగర్‌ రూరల్‌, జనవరి 16(ఆంధ్రజ్యోతి): దేవాలయాలు, తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్న దొంగను గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. నందిగామ మండలం రంగాపూర్‌ గ్రామానికి చెందిన కొనిరెడ్డి వంశీ(23) డ్రైవర్‌. ఈ నెల 14న షాద్‌నగర్‌ పట్టణంలోని రైతు కాలనీలో ఉన్న కోటమైసమ్మ దేవాలయం పూజారి విఠల్‌రావు సాయంత్రం 6గంటలకు తాళం వేసి ఇంటికి వెళ్లాడు. అదేరోజు వంశీ తాళం విరగ్గొట్టి హుండీ ఎత్తుకెళ్లాడు. మరుసటిరోజు పూజారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. కాగా, నిందితుడు వంశీపై పలు పోలీస్‌ స్టేషన్లలో వివిధ రకాల 24 కేసులు ఉన్నాయని తెలిపారు. ఈమేరకు అతడి నుంచి మోటార్‌ సైకిల్‌ రికవరీ చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Updated Date - Jan 16 , 2025 | 11:26 PM