పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడులు
ABN, Publish Date - Jan 09 , 2025 | 11:40 PM
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. మండ పరిధిలోని పేకాట స్థావరాలపై బుధవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ సీఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌గౌడ్, ప్రొబిషనరీ ఎస్‌ఐ శ్వేత సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారు.
నవాబుపేట, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. మండ పరిధిలోని పేకాట స్థావరాలపై బుధవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ సీఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌గౌడ్, ప్రొబిషనరీ ఎస్‌ఐ శ్వేత సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారు. నవాబుపేట, శంకర్‌పల్లి, చేవెళ్ల, తెల్లపూర్ గ్రామాలకు చెందిన 20మందిని గంగ్యాడ గ్రామంలో పేకాడుతుండగా అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గరి నుంచి రూ.32,6511 నగదు, ఐదు కార్లు, ఆరు బైక్‌లు, 21సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌గౌడ్ తెలిపారు.
Updated Date - Jan 09 , 2025 | 11:40 PM