పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య
ABN, Publish Date - Jan 13 , 2025 | 12:14 AM
తెలంగాణ రాష్ట్రంలోని పేదలందరికీ నాణ్యమైన విద్యనందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ఖాలీగా ఉన్న అడ్మిషన్ల పోస్టర్‌ను ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆవిష్కరించారు.
షాద్‌నగర్ అర్బన్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలోని పేదలందరికీ నాణ్యమైన విద్యనందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ఖాలీగా ఉన్న అడ్మిషన్ల పోస్టర్‌ను ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆవిష్కరించారు. 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఖాలీల్లో పేద విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు కావాల్సిన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నదని, పేద విద్యార్థులందరు విధిగా చదువుకుని ప్రయోజకులుగా ఎదుగాలని ఎమ్మెల్యే కోరారు. కమ్మదనం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విద్యుల్లత, కొందుర్గు ప్రిన్సిపాల్ కుర్షిత్ తదితరులు పాల్గొన్నారు. కాగా, అనాథాశ్రమాల్లో జీవనం గడుపుతున్న వారికి ప్రతీఒక్కరు చేతనైన సహాయం చేయాలని ఎమ్మెల్యే శంకర్ పిలుపునిచ్చారు. షాద్‌నగర్ మున్సిపాలిటీలోని ఎఫ్‌సీఎన్ ఫౌండేషన్‌లో ఉన్న అనాథల మధ్య మాజీ జడ్పీటీసీ సభ్యుడు శ్యాంసుందర్‌రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతా్‌పరెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. అనాథలకు అన్నదానం చేశారు.
కుమ్మరి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
షాద్‌నగర్ కుమ్మరి సంఘం క్యాలెండర్‌ను ఆదివారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆవిష్కరించారు. సంఘం అధ్యక్షుడు శ్రీశైలం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అగ్గనూరి విశ్వం, కృష్ణారెడ్డి, చెంది తిరుపతిరెడ్డి, గడ్డం శ్రీనివా్‌సయాదవ్, సర్వర్‌పాష, సంఘం నా యకులు దయానంద్, వీరన్న, రాయికల్ శ్రీనివాస్, వెంకటయ్య, వెంకటేష్, రమేష్, సాయిబాబా, ఆంజనేయులు తదితరులున్నారు.
Updated Date - Jan 13 , 2025 | 12:14 AM