ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజాపాలన దరఖాస్తులు గల్లంతు!

ABN, Publish Date - Jan 07 , 2025 | 12:03 AM

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న ఆప్లికేషన్‌ ఫారాలు గల్లంతయ్యాయి. ఈమేరకు నిజమైన లబ్ధిదారుల వివరాలు ఆన్‌లైన్‌ నమోదు సర్వేలో కనిపించడం లేదంటూ సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు బుద్దుల జంగయ్య లబ్ధిదారులతో కలిసి కొం దుర్గు ఎంపీడీవో లక్ష్మీఅనురాధకు సోమ వారం వినతిపత్రాన్ని అందజేశారు.

ఆన్‌లైన్‌లో నమోదు కాని లబ్ధిదారుల పేర్లు

చౌదరిగూడ, జనవరి 6(ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న ఆప్లికేషన్‌ ఫారాలు గల్లంతయ్యాయి. ఈమేరకు నిజమైన లబ్ధిదారుల వివరాలు ఆన్‌లైన్‌ నమోదు సర్వేలో కనిపించడం లేదంటూ సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు బుద్దుల జంగయ్య లబ్ధిదారులతో కలిసి కొం దుర్గు ఎంపీడీవో లక్ష్మీఅనురాధకు సోమ వారం వినతిపత్రాన్ని అందజేశారు. ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. ఆన్‌లైన్‌ కానీ, నిరుపేదల దరఖాస్తులు గల్లంతుకావడంతో అర్హులైన లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని 22 పంచాయతీలో అన్ని గ్రామాల్లో ఒక్కో జీపీలో ఐదు నుంచి పది ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు గల్లంతయ్యాయని ఆరోపించారు. ఆన్‌లైన్‌లో చూపించని దరఖాస్తులను మళ్లీ స్వీకరించి నిజమైన అర్హులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా నర్సింహ, సురేష్‌, లబ్ధిదారులు లక్ష్మయ్య, రాములు, సునీత, జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 12:03 AM