ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN, Publish Date - Feb 08 , 2025 | 11:27 PM

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కీసర పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

కీసర రూరల్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కీసర పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జలాల్‌పూర్‌ గ్రామానికి చెందిన జైని రవి(45) శుక్రవారం తన బైక్‌పై కుషాయిగూడ మార్కెట్‌కు వెళ్లి సరుకులు తీసుకొని తిరిగి వస్తుండగా చీర్యాల్‌ మెయిన్‌రోడ్డులో రాంగ్‌ రూట్‌లో వచ్చిన ఓ బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రవి తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు, పోలీసులు చికిత్స నిమిత్తం కాచిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు శనివారం తెల్లవారుజామున మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. రవి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బస్సుకింద పడి వ్యక్తి..

కోట్‌ పల్లి: బైక్‌పై వెళ్తున్న వ్యక్తి బస్సుకింద పడి మృతిచెందాడు. ఈ ఘటన కోట్‌పల్లి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిన్నారం గ్రామానికి చెందిన పరమటి బందయ్య(52) బందయ్య తన టీవీఎస్‌ ఎక్సెల్‌ వాహనంపై జిన్నారం చౌరస్తా నుంచి జిన్నారం వైపు వస్తున్నాడు. అదే సమయంలో ఆర్టీసీ బస్సు వికారాబాద్‌ వైపు నుంచి కోట్‌పల్లికి వస్తుండగా బందయ్య బస్సు వెనక టైరుకింద పడి తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. బందయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య పద్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కోట్‌పల్లి ఎస్‌ఐ గఫర్‌ తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో మరొకరు..

మేడ్చల్‌ టౌన్‌: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మేడ్చల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్‌ పట్టణం కిష్టాపూర్‌ రోడ్డులో ఓ సిమెంటు ఇటుకల తయారీలో పనిచేసే కన్నా(40) అనే కార్మికుడు గదిలో శనివారం మృతిచెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కన్నా మృతదేహంపై గాయాలున్నాయని, మరో కార్మికుడు మద్యం మత్తులో హత్యచేసి ఉండవచ్చుననే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేశారు. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Feb 08 , 2025 | 11:27 PM