చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ABN, Publish Date - Jan 19 , 2025 | 11:27 PM
కారు బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఘట్‌కేసర్ రూరల్, జనవరి 19(ఆంధ్రజ్యోతి): కారు బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రాజువర్మ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోచారం మున్సిపాలిటీ, అన్నోజిగూడ రాజీవ్‌గృహకల్పకు చెందిన బత్తిన ఈశ్వర్ (40) తన భార్య రేణుకతో కలిసి బైక్‌పై శనివారం నారపల్లిలోని ఎంజేఆర్ మాల్‌లో సినిమాకు వెళ్లారు. తిరిగి సాయంత్రం ఇంటికి వస్తుండగా అన్నోజిగూడ వద్దకు రాగానే బైక్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త ఈశ్వర్ తలకు బలమైన గాయం కాగా భార్య రేణుకకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి వారిని ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా ఈశ్వర్ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Updated Date - Jan 19 , 2025 | 11:27 PM