అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ABN, Publish Date - Jan 22 , 2025 | 12:08 AM
యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నతూండ్లకు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో మరణించాడు. శవాన్ని రాత్రి వేళ గ్రామానికి తరలించారు. అయితే, అతడి మరణంపై అనుమానం ఉండటంతో సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేయగా..
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో శవపరీక్ష
యాచారం, జనవరి 21(ఆంరఽధజ్యోతి): యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నతూండ్లకు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో మరణించాడు. శవాన్ని రాత్రి వేళ గ్రామానికి తరలించారు. అయితే, అతడి మరణంపై అనుమానం ఉండటంతో సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. క్లూస్‌టీం శవాన్ని పరీక్షించారు. మండల పరిధిలోని చిన్నతూండ్ల గ్రామానికి చెందిన కాసోజు రామాచారి(40) ఉమారాణి(36) దంపతులు. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. అతడు నగరంలో ఉంటూ బైక్‌మెకానిక్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల రామాచారి తట్టువ్యాధితో పాటు పసరికల వ్యాధితో బాధపడినట్లు మృతుడి కుటుంబికులు చెప్పారు. మృతుడి చెంపలపై, గొంతుపై గాయాలుండడంతో అతడి మరణంపై అన్న బాలరాజు, తమ్ముడు శ్రీనివా్‌సలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాచకొండ సీపీకి చెందిన క్లూస్‌టీం అధికారి నీలిమా ఆధ్వర్యంలో శవాన్ని నిషితంగా పరిశీలించారు. అనంతరం ఇబ్రహీంపట్నంలో శవపరీక్ష చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. శవపరీక్షలో వాస్తవాలు తెలుస్తాయని వారు వెల్లడించారు.
Updated Date - Jan 22 , 2025 | 12:08 AM