ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

ABN, Publish Date - Feb 02 , 2025 | 11:39 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శామీర్‌పేట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.

మరో ఇద్దరికి గాయాలు

మూడుచింతలపల్లి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శామీర్‌పేట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కేశవరం గ్రామానికి చెందిన మణిదీప్‌(21), బన్నీ(19), మధు (22) ముగ్గురు స్నేహితులు. మణిదీప్‌ తన కొత్త పల్సర్‌ 220బైక్‌పై ఇద్దరు స్నేహితులను తీసుకొని మూడుచింతలపల్లి మండలానికి సరదాగా గడిపేందుకు వెళ్లారు. మధ్యాహ్నం తిరిగి గ్రామానికి వస్తుండగా మూలమలుపు వద్ద బైక్‌ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న బన్నీయాదవ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. మణిదీప్‌, మధులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చికిత్స పొందుతూ వ్యక్తి..

కీసర, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి ఆదివారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కీసర గ్రామానికి చెందిన జూపల్లి రమేష్‌(42) భార్య కొంతకాలం కిందట ఆనారోగ్యంతో మృతి చెందింది. ఇద్దరు పిల్లలు కావడంతో రమేష్‌ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై రెండు రోజుల కిందట పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే లక్ష్మక్కపల్లిలోని ఆర్‌వీఎం ఆస్పత్రికి తరలించగా ఆదివారం చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Updated Date - Feb 02 , 2025 | 11:39 PM