పోస్టాఫీస్‌లో డబ్బులు దుర్వినియోగం
ABN, Publish Date - Jan 29 , 2025 | 12:22 AM
పట్టణంలోని పోస్టాఫీ్‌సలో పదేళ్ల కిందట జరిగిన డబ్బులు దుర్వినియోగం కేసులో నిందితుడికి రెండేళ్ల శిక్ష పడినట్లు ఎస్‌ఐ జీవి.సత్యనారాయణ తెలిపారు.
నిందితుడికి రెండేళ్ల జైలు
కొడంగల్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పోస్టాఫీ్‌సలో పదేళ్ల కిందట జరిగిన డబ్బులు దుర్వినియోగం కేసులో నిందితుడికి రెండేళ్ల శిక్ష పడినట్లు ఎస్‌ఐ జీవి.సత్యనారాయణ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రజలు తమ ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ కోసం 23.07.2014 నుంచి 24.07.2014 వరకు రెండు రోజులు బ్రాంచీ ఆఫీస్ అకౌంట్ పేమేంట్స్ రాకపోవడంతో డబ్బుల విషయం గురించి పోస్ట్‌మేల్ సర్వీసెస్ ఇన్‌స్పెక్టర్ నవీన్‌కుమార్ పోస్టుమేల్ సర్వీసెస్ రాములు, బుచ్చయ్యతో కలిసి కొడంగల్‌లోని బాలాజీనగర్ బ్రాంచీలో తనిఖీచేయగా అందులో రూ.74,340కు సంబంధించి ఎలాంటి లావాదేవీలు లేవని గుర్తించారు. ఈ విషయం గురించి బీపీఎం గోపాలకృష్ణ సొంత ఖర్చుల కోసం వాడుకున్నాడని తెలియడంతో డబ్బుల దుర్వినియోగానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్‌లను సీజ్‌చేసి విచారణ చేపట్టగా ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ నవీన్‌కుమార్ ఫిర్యాదు మేరకు గోపాలకృష్ణపై కొడంగల్ పోలీ్‌సస్టేషన్‌లో అప్పటి ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ కేసు నమోదు చేశారు. మంగళవారం నేరాభియోగపత్రాలను కొడంగల్ ఎస్‌ఐ జీవి.సత్యనారాయణ కోర్టులో దాఖలు చేయగా నిందితుడు గోపాలకృష్ణకు న్యాయమూర్తి శ్రీరామ్ రెండేళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Updated Date - Jan 29 , 2025 | 12:22 AM