ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

ABN, Publish Date - Jan 21 , 2025 | 12:03 AM

ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మోమిన్‌పేట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

మోమిన్‌పేట్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మోమిన్‌పేట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ అరవింద్‌ తలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గజ్జల సుదర్శన్‌గౌడ్‌ కుమారుడు గజ్జల శివశంకర్‌గౌడ్‌(28) ఇంటి దగ్గరే ఉంటూ కిరాణ దుకాణం నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈక్రమంలో ఈనెల 19వ తేదీన నందివాగు సమీపంలోని తమ సొంత పొలానికి వెళ్లివస్తానని బయల్దేరి వెళ్లాడు. ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అనుమానం వచ్చి అక్కడికి వెళ్లి చూడగా బావిలో మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మర్పల్లి ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి గజ్జల సుదర్శన్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jan 21 , 2025 | 12:03 AM