ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైలు ఢీకొని వృద్ధురాలి మృతి

ABN, Publish Date - Feb 01 , 2025 | 12:08 AM

వృద్ధాప్య పెన్షన్‌ డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్తున్న వృద్ధురాలు ప్రమాదవశాత్తు గూడ్స్‌ రైలు ఢీకొని మృతిచెందింది.

తాండూరు, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): వృద్ధాప్య పెన్షన్‌ డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్తున్న వృద్ధురాలు ప్రమాదవశాత్తు గూడ్స్‌ రైలు ఢీకొని మృతిచెందింది. పాత తాండూరు రైల్వేగేటు వద్ద శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పాత తాండూరు హమాలిగల్లికి చెందిన వృద్ధురాలు నర్సమ్మ(64) పింఛన్‌ డబ్బులు డ్రాచేసుకుని ఇంటికి వచ్చేందుకు బయల్దేరింది. రైల్వే గేటు వద్ద నుంచి వస్తుండగా పట్టాలు దాటే క్రమంలో ఓగూడ్స్‌ రైలు వృద్ధురాలిని ఢీ కొట్టింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. వృద్ధురాలికి వినికిడి లోపంతో పాటు కంటి చూపు సక్రమంగా లేదని స్థానికులు తెలిపారు. నర్సమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదంలో ఒకరు..

మేడ్చల్‌ టౌన్‌: ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓవ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్‌ పోలీస్టేషన్‌ పరిధిలోని ఓఆర్‌ఆర్‌ గుండూ కారులో శుక్రవారం తెల్లవారుజామున దుండిగల్‌ వైపు వెళ్తున్న సంగమేశ్వర్‌(21), ఎస్‌.సుభా్‌షలు లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో కారు తలకిందులైంది. కారు నడుపుతున్న సంగమేశ్వర్‌ అక్కడికక్కడే మృతిచెందగా సుభా్‌షకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మేడ్చల్‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 01 , 2025 | 12:08 AM