ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అర్హులు ఎందరో!

ABN, Publish Date - Jan 19 , 2025 | 12:04 AM

కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదల నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. కార్డుల జారీకి అర్హుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.

  • రేషన్‌కార్డుల జారీకి కొనసాగుతున్న సర్వే

  • క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల గుర్తింపు 8 నేటితో ముగియనున్న ప్రక్రియ

  • జాబితాలో పేరు లేకపోతే మళ్లీ దరఖాస్తుకు అవకాశం

  • ఈనెల 26న కొత్త కార్డులు జారీ

కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదల నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. కార్డుల జారీకి అర్హుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. గతేడాది నిర్వహించిన సామాజిక ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన నివేదిక ఆధారంగా జాబితాను రూపొందించారు. జిల్లాలో రేషన్‌కార్డుల కోసం 23,542 దరఖాస్తులను ప్రాథమికంగా అర్హత ఉన్నట్లుగా గుర్తించారు. ఇందులో 17,492 దరఖాస్తుల పరిశీలన క్షేత్రస్థాయిలో పూర్తికాగా, మండలాల వారీగా అర్హుల జాబితాను రూపొందించారు. వీటిని గ్రామాల వారీగా విభజించి పంచాయతీ కార్యదర్శులకు పంపించారు. అర్హుల ఎంపికపై ఈ నెల 16న ప్రారంభమైన క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ ఈ నెల 20 వరకు పూర్తి కానుంది.

వికారాబాద్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ప్రస్తుతం 2,41,179 రేషన్‌ కార్డులు ఉండగా 8,09,218 మంది సభ్యులు ఉన్నారు. స్వరాష్ట్రం ఏర్పాటైన త ర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో 2018, 2022లో అర్హులుగా గుర్తించిన వారిలో కొందరికి మాత్రమే ఆహార భద్రత కార్డులు జారీ చేశారు. మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినప్పుడు కొందరు రేషన్‌ కార్డులకు, మరికొందరు మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలోనూ కొందరు తెల్ల కాగితాలపై రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక ఆర్థిక, కుల గణన సర్వేలో ప్రజలు రేషన్‌ కార్డులు కావాలంటూ దరఖాస్తు పెట్టుకున్నారు. ఆన్‌లైన్‌లో పొందుపరిచిన సర్వే ఆధారంగా ఉన్నతాధికారులు 360 సాఫ్ట్‌వేర్‌ సాంకేతికతను ఉపయోగించి అర్హులను ఎంపిక చేశారు. ఈ జాబితా ఆధారంగా ఈనెల 16 నుంచి క్షేత్రస్థాయిలో అర్హుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి వార్షికాదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.2 లక్షల లోపు ఉంటే అర్హతగా నిర్ణయించారు. మాగాణి(తరి) 3.5 ఎకరాలు, మెట్ట 7 ఎకరాల వరకు ఉండవచ్చని నిబంధన విధించారు. దరఖాస్తుదారుడి పేరిట కారు ఉంటే నమోదు చేయాలని సూచించగా, వ్యవసాయ ట్రాక్టర్లు, వ్యవసాయ వాహనాలకు మినహాయింపు ఇచ్చారు.

గ్రామ, వార్డు సభల్లో అర్హుల ఎంపిక

జిల్లాలో కొత్తరేషన్‌ కార్డుల జారీకి నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి పరిశీలన శనివారం వరకు 74 శాతం పూర్తయింది. కొత్త రేషన్‌ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల్లో ప్రాథమికంగా 23,542 దరఖాస్తులను అర్హత ఉన్నట్లుగా గుర్తించారు. వాటిలో 17,492 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అర్హుల జాబితాలను ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే గ్రామ, వార్డు సభల్లో ప్రదర్శించనున్నారు. అక్కడ అర్హులను ఎంపిక చేయనున్నారు. కొత్త రేషన్‌ కార్డులకు అర్హులుగా ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలను ఎంపీడీవోలు ఈనెల 25న కలెక్టర్‌ లాగిన్‌ నుంచి కమిషనర్‌కు అప్‌లోడ్‌ చేస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత లబ్ధిదారుల జాబితా కలెక్టర్‌ లాగిన్‌కు పంపించనున్నారు. ఈనెల 26న కొత్త కార్డులను అందజేస్తారు.

మండలాల వారీగా దరఖాస్తుల వివరాలు

కొత్త రేషన్‌ కార్డులు జారీ చేసేందుకు 23,542 దరఖాస్తులను క్షేత్ర స్థాయి పరిశీలనకు ఎంపిక చేశారు. వికారాబాద్‌ మండలంలో 682 దరఖాస్తులు, ధారూరులో 1,125, మర్పల్లిలో 1,208, మోమిన్‌పేట్‌లో 12, బంట్వారంలో 484, కోట్‌పల్లిలో 734, నవాబ్‌పేట్‌లో 794 దరఖాస్తులపై పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది పరిశీలన కొనసాగిస్తున్నారు. పరిగి మండలంలో 1,501, కులకచర్లలో 1,088, పూడూరులో 1,066, దోమలో 1,175 దరఖాస్తులు, కొడంగల్‌లో 1,068, దౌల్తాబాద్‌లో 1,396, బొంరా్‌సపేట్‌లో 960, దుద్యాల్‌లో 629 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. తాండూరులో 1,546, బషీరాబాద్‌లో 1,506, యాలాలలో 1,202, పెద్దేముల్‌లో 1,491, చౌడాపూర్‌లో 697దరఖాస్తులపై పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. మున్సిపాలిటీలైన తాండూరులో 1,193, వికారాబాద్‌లో 901, పరిగిలో 406, కొడంగల్‌లో 294 దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది.

మంత్రి ప్రకటనతో చిగురించిన ఆశలు

ఆరేళ్లుగా కొత్త కార్డుల జారీ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌రెడ్డి పాత రేషన్‌ కార్డులు తొలిగించమని, కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చేలా చర్యలు తీసుకుంటామని శనివారం ప్రకటించడంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురించాయి.

Updated Date - Jan 19 , 2025 | 12:04 AM