ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇళ్లు, నాపరాతి గుట్టలకూ ‘రైతు బంధు’ ఇచ్చారు!

ABN, Publish Date - Jan 21 , 2025 | 12:07 AM

మండలంలోని పలు గ్రామాల పరిధిలోని వ్యవసాయేతర భూములు, నాపరాళ్ల గుట్టలకు పెద్ద ఎత్తున రైతుబంధు పథకం కింద చెల్లింపులు జరిగినట్లు తేలింది.

నాపరాళ్ల గని భూములను పరిశీలిస్తున్న తహసీల్దార్‌ వెంకటేష్‌

బషీరాబాద్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల పరిధిలోని వ్యవసాయేతర భూములు, నాపరాళ్ల గుట్టలకు పెద్ద ఎత్తున రైతుబంధు పథకం కింద చెల్లింపులు జరిగినట్లు తేలింది. రైతుభరోసా పథకాన్ని ఈనెల 26 నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి వ్యవసాయేతర భూముల సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మండలంలోని క్యాద్గీరా, కొర్విచెడ్‌, నవాల్గ తదితర గ్రామాల పరిధిలో 374.02 ఎకరాల నాపరాళ్ల గనులు, గుట్టలు సాగు యోగ్యంగా లేనట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో 94.33 ఎకరాల ఇళ్ల స్థలాలుగా మారిన భూములు కూడా ఉన్నట్లు అఽధికారులు తేల్చారు. సర్వే నంబర్ల వారీగా మొత్తం 490.3 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. జీవన్గిలో బ్రిడ్జి ఇరువైపుల ఆప్రోచ్‌ రోడ్డు నిర్మాణానికి 10 ఎకరాలు ప్రభుత్వం కొనుగోలు చేసి స్వాధీనం చేసుకోవడంతో ఆ భూములను వ్యవసాయేత భూములుగా గుర్తించి రైతుల పేర్లను తొలగించనున్నారు. ఇలా గత ఆరేళ్లలో ఆయా భూములకు రైతు బంధు పేరిట రూ.కోట్లలో నిధులు దుర్వినియోగమైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై బషీరాబాద్‌ తహసీల్దార్‌ వెంకటేష్‌ను వివరణ కోరగా మండలంలో నిర్వహించిన రైతుభరోసా సర్వేలో 490.3 ఎకరాల వ్యవసాయేతర భూములను గుర్తించినట్లు తెలిపారు. క్యాద్గీరా, కొర్విచెడ్‌, నవాల్గ గ్రామ శివారుల్లో నాపరాళ్ల తవ్వకాలు జరిపిన పనికి రాని భూములు అధికంగా ఉన్నాయని చెప్పారు. భూముల రైతు పేర్లు, వివరాలను గ్రామ సభల్లో మరోసారి చదివి వినిపిస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం ధరణి పోర్టల్‌లో నుంచి ఆట్టి భూములను తొలగిస్తామని స్పష్టం చేశారు.

Updated Date - Jan 21 , 2025 | 12:07 AM