ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యుత్‌ సిబ్బందిపై హాస్టల్‌ నిర్వాహకుడి దాడి.. కేసు నమోదు

ABN, Publish Date - Feb 01 , 2025 | 11:33 PM

విద్యుత్‌ బకాయి బిల్లు చెల్లించుమన్నందుకు ఓ హాస్టల్‌ నిర్వాహకుడు విద్యుత్‌ సిబ్బందిపై దాడిచేసిన ఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ బకాయి బిల్లు చెల్లించుమన్నందుకు ఓ హాస్టల్‌ నిర్వాహకుడు విద్యుత్‌ సిబ్బందిపై దాడిచేసిన ఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నర్సింహా తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌ పట్టణం, బుగ్గబాయి కాలనీకి చెందిన గోపాలకృష్ణ హాస్టల్‌ నిర్వహిస్తున్నాడు. తనకున్న హాస్టల్‌ భవనానికి 15కరెంటు మీటర్లకుగాను రూ.80వేల బిల్లు పెండింగ్‌లో ఉంది. బిల్లుచెల్లించాలని విద్యుత్‌ సిబ్బంది వినోద్‌కుమార్‌, పవన్‌, లక్ష్మణ్‌లు కోరగా గోపాలకృష్ణ ఆగ్రహంతో అసభ్యకరంగా దూషిస్తూ వారిపై దాడికి యత్నించాడు. దాడి చేస్తున్న విషయాన్ని సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరిస్తుండగా ఫోన్‌ లాక్కొని ధ్వంసం చేశాడు. విద్యుత్‌ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Feb 01 , 2025 | 11:33 PM