హజ్రత్ జేపీ దర్గాలో గుసూల్ ఏ షరీఫ్
ABN, Publish Date - Jan 15 , 2025 | 11:58 PM
మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ గ్రామ శివారులోని హజ్రత్ జహంగీర్‌పీర్ దర్గాలో బుధవారం గుసూల్ ఏ షరీఫ్ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
హాజరైన ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే
కొత్తూర్, జనవరి 15:(ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ గ్రామ శివారులోని హజ్రత్ జహంగీర్‌పీర్ దర్గాలో బుధవారం గుసూల్ ఏ షరీఫ్ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈనెల 16నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే ఉర్సు ఉత్సవాలను పురస్కరించుకుని ఒక రోజు ముందుగా దర్గాలోని సమాధులను క్షీరాభిషేకం నిర్వహించి, చాదర్లు సమర్పించడం అనవాయితీ. ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ ఈట గణేష్, ఇన్ముల్‌నర్వ మాజీ సర్పంచులు మిట్టునాయక్, అజయ్‌నాయక్, బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ, కడెంపల్లి శ్రీనివాస్, బి.దేవేందర్‌యాదవ్, పెంటనోళ్ల యాదగిరి, శివచారి, ఇంద్రాసేనారెడ్డి, గోపాల్‌నాయక్, జంగయ్యయాదవ్, నవాజ్ పాల్గొన్నారు.
Updated Date - Jan 15 , 2025 | 11:58 PM