చెత్త తరలిస్తున్న లారీ దగ్ధం
ABN, Publish Date - Jan 19 , 2025 | 12:00 AM
ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి చెత్త తరలిస్తున్న లారీ దగ్ధమైంది. ఈ ఘటన శనివారం కీసర పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
కీసర రూరల్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి చెత్త తరలిస్తున్న లారీ దగ్ధమైంది. ఈ ఘటన శనివారం కీసర పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర పోలీస్ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వివరాల ప్రకారం జీహెచ్‌ఎంసీకి చెందిన లారీలో నగరం నుంచి చెత్తను డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో చెత్త లోడ్‌తో ఉన్న లారీ దమ్మాయిగూడ మున్సిపాలిటీ అహ్మద్‌గూడ వద్దకు చేరుకోగా లారీ క్యాబిన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ సతీష్ లారీని పక్కకు నిలిపి కిందకు దిగాడు. అనంతరం మంటలు పెద్దఎత్తున చెలరేగి, క్యాబిన్ పూర్తిగా తగలబడిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Jan 19 , 2025 | 12:00 AM