ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చోరీ కేసులో నలుగురి రిమాండ్‌

ABN, Publish Date - Jan 19 , 2025 | 12:00 AM

గోడౌన్‌లో నగదు దొంగిలించిన నలుగురిని పోలీసులు అరెస్టుచేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. మొయినాబాద్‌ మండల కేంద్రంలోని భరద్వాజ్‌ కాలనీలో పద్మావతి అసోసియేట్‌ పేరుతో ఓ గోదాం ఉంది. దానికి పెద్దమంగళారం గ్రామానికి చెందిన వినీత్‌రెడ్డి ఇన్‌చార్జిగా ఉన్నాడు.

మొయినాబాద్‌, జనవరి 18(ఆంరఽధజ్యోతి): గోడౌన్‌లో నగదు దొంగిలించిన నలుగురిని పోలీసులు అరెస్టుచేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. మొయినాబాద్‌ మండల కేంద్రంలోని భరద్వాజ్‌ కాలనీలో పద్మావతి అసోసియేట్‌ పేరుతో ఓ గోదాం ఉంది. దానికి పెద్దమంగళారం గ్రామానికి చెందిన వినీత్‌రెడ్డి ఇన్‌చార్జిగా ఉన్నాడు. ఈనెల 15న రాత్రి గోడౌన్‌ షట్టర్‌ పగులగొట్టి రూ.6 ఎత్తుకెళ్లారు. ఈ విషయమై బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేశారు. మొయినాబాద్‌లో కిరాణా షాపు నడుపుతున్న సైతాన్‌రామ్‌ అనే వ్యక్తి అదే గోదాంలో కిరాణ సామాను కొనుగోలు చేసేవాడు. ఈ క్రమంలో బీరువాలో డబ్బులు పెట్టడాన్ని గమనించిన సైతాన్‌రామ్‌.. మొయినాబాద్‌లోని తనకు తెలిసిన బైక్‌ మెకానిక్‌ రామేశ్వర్‌కు చెప్పాడు. ఇద్దరూ కలిసి డబ్బు కాజేయాలని నిర్ణయించుకున్నారు. గోదాం వ్యక్తులు తమ ముఖాలను గుర్తుపడతారని భావించి.. కొంపల్లిలో ఉండే హులాస్‌ను, అతనితో పాటు ఓ ఫాంహౌ్‌సలో వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్న భవానిసింగ్‌ అనే వ్యక్తిని పిలిపించుకొని, గోదాం వెనకాల షట్టర్‌ను గడ్డపారతో పైకి లేపి బీరువాలో ఉన్న నగదు దొంగిలించారు. అదేరోజు నలుగురు నగదును సమానంగా పంచుకున్నారు. అయితే, సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు నిందితులను గుర్తించి పట్టుకున్నారు. వారినుంచి రూ.2లక్షల 96వేల నగదు, మహేంద్ర బొలెరో వాహనం, బైక్‌, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరిచారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Jan 19 , 2025 | 12:00 AM