ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంక్రాంతి తర్వాత బీజాపూర్‌ హైవే విస్తరణ

ABN, Publish Date - Jan 08 , 2025 | 11:45 PM

సంక్రాంతి పండుగ తర్వాత హైదరాబాద్‌ - బీజాపూర్‌ జాతీయ రహదారి రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించి ఏడాదిలో పూర్తి చేస్తామని రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

చేవెళ్లలో పీఏసీఎస్‌ గోదాంను ప్రారంభిస్తున్న మంత్రి కోమటిరెడ్డి, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌

రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

జిల్లా అభివృద్ధిని విస్మరించిన గత ప్రభుత్వం

అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

చేవెళ్లలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం

చేవెళ్ల, జనవరి 8 (ఆంధ్రజ్యోతి) : సంక్రాంతి పండుగ తర్వాత హైదరాబాద్‌ - బీజాపూర్‌ జాతీయ రహదారి రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించి ఏడాదిలో పూర్తి చేస్తామని రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. బుధవారం చేవెళ్లలో రూ.70 లక్షలతో నిర్మించిన పీఏసీఎస్‌ గోదాం, అలాగే చైర్మన్‌ దేవర వెంకట్‌రెడ్డి తన సొంత నిధులు రూ.38 లక్షలతో నిర్మించిన పీఏసీఎస్‌ కార్యాలయ భవనంతో పాటు ముడిమ్యాల్‌ గేట్‌ నుంచి రావులపల్లి, మేడిపల్లి గ్రామం వరకు రూ.24కోట్లతో వేయనున్న రోడ్డు నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల ఇన్‌చార్జి భీంభరత్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ... పోలీస్‌ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర హైవే రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌ మేగా కృష్ణారెడ్డిని ఇప్పటికే ఆదేశించామన్నారు. ఈ విషయంపై మరోమారు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరితో మాట్లాడుతానని తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలోని ఆర్‌అండ్‌బీ లింక్‌ రోడ్లను రూ.60 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు.

అభివృద్ధిలో వెనుకబడిన జిల్లా : గడ్డం ప్రసాద్‌కుమార్‌

గత బీఆర్‌ఎస్‌ పాలనలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధి పరంగా వెనుకబడిందని అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్‌ పదేళ్లలో రూ.7 లక్షల కోట్లు అప్పు చేశాడన్నారు. దానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతీనెల వడ్డీలు కడుతుందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బోళా శంకరుడని.. ఏది అడిగినా ఇస్తాడని చెప్పారు. ఈ నెల 26వ తేదీ నుంచి రైతు భరోసా అందజేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కొండలకు, గుట్టలకు, రైతుబంఽధు ఇచ్చి రూ. 25672 కోట్లు వృథా చేసిందని ఆరోపించారు.

పథకాలను వినియోగించుకోవాలి : ప్రభుత్వ విప్‌ మహేందర్‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలోని రోడ్లు అభివృద్ధి చేయాలని మంత్రి కోమటిరెడ్డికి సూచించారు.

నియోజకవర్గ అభివృద్ధికి నిధులివ్వండి : ఎమ్మెల్యే యాదయ్య

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూ రు చేయాలని, హైదరాబాద్‌-బీజాపూర్‌ రోడ్డు పనులు వేగంగా జరిగేలా చూడాలని మంత్రి కోమటిరెడ్డిని ఎమ్మెల్యే కాలె యాదయ్య కోరారు. అనంతరం రావులపల్లి గ్రామం మాజీ సర్పంచ్‌ శ్రీనివాస్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సభ్యుడు సత్యనారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి, డీసీసీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహరెడ్డి, మాజీ అధ్యక్షుడు వెంకట్‌స్వామి, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, ప్రతా్‌పరెడ్డి, నక్క బుచ్చిరెడ్డి, ఏఎంసీ చైర్మన్లు పెంటయ్యగౌడ్‌, సురేందర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు వీరేందర్‌రెడ్డి, మాణెయ్య, వసంతం, దర్శన్‌, రాజుగౌడ్‌, జనార్ధన్‌రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, సమతారెడ్డి, సరితారెడ్డి, శైలజాఆగిరెడ్డి, రాములు, స్వరూప, మల్లేష్‌, రాములు, మధుసూదన్‌గుప్తా, గోపాల్‌రెడ్డి, లావణ్యశంకర్‌, భీమయ్య, ప్రభాకర్‌, రాంచంద్రయ్య, శ్రీనివాస్‌, రమేశ్‌గౌడ్‌, పాండు, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2025 | 11:45 PM