గుర్తుతెలియని వ్యక్తి మృతి
ABN, Publish Date - Jan 10 , 2025 | 12:18 AM
నడుస్తున్న రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్ మల్లేశ్వర్ తెలిపారు. బుధవారం అర్ధరాత్రి మహబూబ్‌నగర్ నుంచి ఉందానగర్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని రైలు నుంచి జారి పడినట్లు తెలిపారు.
షాద్‌నగర్ రూరల్, జనవరి 9(ఆంధ్రజ్యోతి): నడుస్తున్న రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్ మల్లేశ్వర్ తెలిపారు. బుధవారం అర్ధరాత్రి మహబూబ్‌నగర్ నుంచి ఉందానగర్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని రైలు నుంచి జారి పడినట్లు తెలిపారు. గ్యాంగ్‌మెన్లు గమనించి స్టేషన్ మాస్టర్‌కు సమాచారం ఇవ్వడంతో అదే రాత్రి షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 40 సంవత్సరాలు ఉంటుందని, శరీరంపై లైట్‌గ్రీన్ కలర్ షరు,్ట బ్లాక్‌కలర్ ప్యాంట్, వైట్ బనియన్ ఉన్నట్లు తెలిపారు. స్టేషన్ మాస్టర్ అవదేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, మృతుడి ఆచూకీ తెలిసిన వారు 98480-90420 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
Updated Date - Jan 10 , 2025 | 12:18 AM