అదుపు తప్పి డీసీఎం బోల్తా
ABN, Publish Date - Jan 19 , 2025 | 11:26 PM
డీసీఎం బోల్తా పడిన ప్రమాదంలో 15మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఘట్‌కేసర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
15 మందికి తీవ్ర గాయాలు
ఆరు బైక్‌లు ధ్వంసం
ఘట్‌కేసర్ రూరల్, జనవరి 19(ఆంధ్రజ్యోతి): డీసీఎం బోల్తా పడిన ప్రమాదంలో 15మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఘట్‌కేసర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అడ్మిన్ ఎస్‌ఐ బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన బాలయ్య నగరంలోని ఎన్టీఆర్‌నగర్‌లో ఉంటున్నాడు. శనివారం సాయంత్రం పొట్టొల బాలయ్య తన మనువరాలు పుట్టువెంట్రుకలు తీయడానికి కుటుంబసభ్యులు, బందువులు 35 మందితో కలిసి యాదగిరిగుట్టకు డీసీఎం వ్యాన్‌లో వెళ్లారు. పుట్టువెంట్రుకలు తీసుకోని తిరిగి ఆదివారం సాయంత్రం ఇంటికి వస్తుండగా ఘట్‌కేసర్ బైపా్‌సరోడ్డులోని మైసమ్మగుట్ట సమీపంలో డీసీఎం వ్యాన్ బ్రేకులు ఫెయిల్ కావడంతో రోడ్డుపై ఉన్న దాదాపు ఆరు బైకులను ఢీకొట్టి సర్వీసురోడ్డులో పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం వ్యాన్‌లో ఉన్న ఎనిమిది మందికి, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఎదులాబాద్‌కు చెందిన మంజుల, చందన, విగ్నేష్, భవ్యశ్రీ, యశ్వంత్‌లతకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ జంగయ్యచారి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు, స్థానికులు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం పలువురిని నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, మరికొంత మందిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. డీసీఎం వ్యాన్‌ను పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అడ్మిన్ ఎస్‌ఐ తెలిపారు.
Updated Date - Jan 19 , 2025 | 11:26 PM