ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాల్యవివాహం చేయొద్దని కౌన్సెలింగ్‌

ABN, Publish Date - Jan 22 , 2025 | 12:08 AM

మైనర్‌కు వివాహం చేసేందుకు ప్రయత్నిస్తున్న కుటుంబసభ్యులకు చైల్డ్‌లైన్‌, పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

ధారూరు, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): మైనర్‌కు వివాహం చేసేందుకు ప్రయత్నిస్తున్న కుటుంబసభ్యులకు చైల్డ్‌లైన్‌, పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఓగ్రామానికి చెందిన మైనర్‌(17) వికారాబాద్‌లోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే బాలిక సంక్రాంతి సెలవులకు కాలేజీ నుంచి ఇంటికి రావటంతో తల్లిదండ్రులు పెళ్లిచేయాలని నిర్ణయించారు. ఈ విషయం 1098 చైల్డ్‌లైన్‌కు ఫోన్‌కాల్‌ సమాచారం రావటంతో మంగళవారం వారు ఐసీడీఎస్‌, పోలీసు సిబ్బందితో కలిసి గ్రామానికి వెళ్లారు. బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 18సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహం చేయాలని నచ్చజెప్పారు. అనంతరం బాలికను వికారాబాద్‌ సఖీ కేంద్రానికి తరలించారు.

Updated Date - Jan 22 , 2025 | 12:08 AM