ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బస్సు బంద్‌.. విద్యార్థుల ధర్నా

ABN, Publish Date - Jan 09 , 2025 | 12:19 AM

జనగాం గ్రామానికి చెందిన విద్యార్థులు, వారి తల్లితండ్రులు బుధవారం మంబాపూర్‌ గ్రామంలో ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల హామీతో విరమించారు. పెద్దేముల్‌ మండలం జనగాం గ్రామానికి సమయానుకూలంగా రోజూ ఉదయం, సాయంత్రం ఆర్టీసీ బస్సు సర్వీస్‌ నడుస్తుంది. గ్రామ సమీపంలో మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ లీకేజీ కారణంగా అక్కడ బురదగా మారింది. వారం క్రితం ఆ బురదలో బస్సు దిగబడింది.

రోడ్డుపై రాస్తారోకో చేస్తున్న విద్యార్థులు

గంటపాటు ట్రాఫిక్‌జామ్‌

పెద్దేముల్‌, జనవరి 8(ఆంధ్రజ్యోతి): జనగాం గ్రామానికి చెందిన విద్యార్థులు, వారి తల్లితండ్రులు బుధవారం మంబాపూర్‌ గ్రామంలో ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల హామీతో విరమించారు. పెద్దేముల్‌ మండలం జనగాం గ్రామానికి సమయానుకూలంగా రోజూ ఉదయం, సాయంత్రం ఆర్టీసీ బస్సు సర్వీస్‌ నడుస్తుంది. గ్రామ సమీపంలో మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ లీకేజీ కారణంగా అక్కడ బురదగా మారింది. వారం క్రితం ఆ బురదలో బస్సు దిగబడింది. దీంతో ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసు నిలిపివేశారు. దీంతో విద్యార్థులు పాఠశాల, కళాశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆర్టీసీ డీఎంతో గ్రామస్థులు మాట్లాడితే మీరెవరు బస్సు దిగబడినపుడు సహకరించలేదని, అందుకోసం తాము బస్సు సర్వీసును నిలిపివేశామని చెప్పినట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు. పైప్‌లైన్‌ లీకేజీతో బురదగా మారిన చోట మరమ్మతులు చేశామని, ఇపుడు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పినా అధికారులు బస్సు వేయడం లేదని వాపోయారు. బస్సు సర్సీలు లేక మంబాపూర్‌ వరకు నడుచుకుంటూ వెల్లి అక్కడి నుండి బస్సులు వెలుతుంటే పాఠశాల, కళాశాల సమయం దాటిపోతోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు మొరపెట్టుకున్నా వారం రోజుల నుండి బస్సు వేయడం లేదని, అందువల్ల తాము ధర్నాకు దిగామని విద్యార్థులు పేర్కొన్నారు. తాండూరు-హైదరాబాద్‌ రోడ్డుపై విద్యార్థులు వారితల్లితండ్రులతో కలిసి రాస్తారోకో చేయడంతో ఆరోడ్డులో సుమారు గంటపాలు రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు మంబాపూర్‌ గ్రామానికి చేరుకుని విద్యార్థులు వారితల్లితండ్రులతో మాట్లాడారు. తాము ఆర్టీసీ డీఎంతో మాట్లాడి గ్రామానికి బస్సువచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

Updated Date - Jan 09 , 2025 | 12:19 AM