త్వరలోనే రైతులందరికీ ‘భరోసా’
ABN, Publish Date - Feb 01 , 2025 | 12:11 AM
త్వరలోనే అన్ని గ్రామాల రైతులకు రైతు భరోసా డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతాయని, ఎలాంటి ఆందోళన చెందొద్దని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
కులకచర్ల, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): త్వరలోనే అన్ని గ్రామాల రైతులకు రైతు భరోసా డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతాయని, ఎలాంటి ఆందోళన చెందొద్దని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఉదాహరణగా మండలానికి ఒక గ్రామం ఎంపిక చేసి పథకాలు అమలు చేశామని చెప్పారు. త్వరలో అన్ని గ్రామాలకు పథకాలు అందుతాయని తెలిపారు. ఇచ్చిన హామీలను విడతల వారీగా ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికారాబాద్ జడ్పీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. ఈ సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షుడు భీమ్‌రెడ్డి, మార్కెట్ కమిటీచైర్మన్ బీఎ్‌స.ఆంజనేయులు, సొసైటీ చైర్మన్ మొగులయ్య, భరత్‌కుమార్, గోపాల్‌నాయక్, జంగయ్య, వెంకటయ్యగౌడ్, ఆనందం, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులకు పదవీ విరమణ తప్పదు
ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తప్పదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న శ్రీనివాస్ శుక్రవారం పదవీ విరమణ సందర్భంగా ఆయనను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో భీమ్‌రెడ్డి, బీఎస్.ఆంజనేయులు, మొగులయ్య, భరత్‌కుమార్, గోపాల్‌నాయక్, జంగయ్య పాల్గొన్నారు.
Updated Date - Feb 01 , 2025 | 12:11 AM