రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
ABN, Publish Date - Jan 28 , 2025 | 12:28 AM
రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మేడ్చల్ టౌన్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ పట్టణంలో సోమవారం అంబేడ్కర్ చౌరస్తా వద్ద రోడ్డు దాటున్న గుర్తుతెలియని వ్యక్తిని లారీ ఢీకొంది. దీంతో అతడు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి వయసు సుమారు 35 సంవత్సరాల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - Jan 28 , 2025 | 12:28 AM