ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చోరీ కేసులో నిందితుడికి రెండేళ్లు జైలు

ABN, Publish Date - Jan 07 , 2025 | 12:05 AM

చోరీ కేసులో నిందితుడికి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ కొడంగల్‌ మున్సిఫ్‌ కోర్టు న్యాయాధికారి శ్రీరామ్‌ సోమవారం తీర్పునిచ్చినట్లు ఎస్‌ఐ జీవీ. సత్యనారాయణరెడ్డి తెలిపారు.

కొడంగల్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): చోరీ కేసులో నిందితుడికి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ కొడంగల్‌ మున్సిఫ్‌ కోర్టు న్యాయాధికారి శ్రీరామ్‌ సోమవారం తీర్పునిచ్చినట్లు ఎస్‌ఐ జీవీ. సత్యనారాయణరెడ్డి తెలిపారు. హస్నాబాద్‌ గ్రామానికి చెందిన బోయిని మొగులప్ప ఆగస్టు 29, 2016లో కొడంగల్‌కు వెళ్లగా ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో అత్త బోయిని కళావతి ఇంట్లోకి వెళ్లి చూడగా గుర్తుతెలియని దుండగులు ప్రవేశించి ఇంట్లో ఉన్న రెండు వెండి కడియాలు(30) తులాలు అపహరించుకెళ్లారు. చుట్టుపక్కల ఉన్న వారిని ఆరా తీయగా గుండ్లకుంట నర్సమ్మ, బచ్చనుల రాములు అనే వ్యక్తులు కుదురుమళ్ల గ్రామానికి చెందిన పంతులు మల్లేశ్‌ అనే వ్యక్తి ఇంటి ముందు నుంచి వెళినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు పూర్తి చేసి నేరభియోగపత్రము కోర్టులో సమర్పించగా నిందితుడు పంతులు మల్లేశ్‌కు రెండు సంవత్సరాల జైలు శిక్ష, రూ.500జరిమానా విధించినట్లు ఎస్‌ఐ వివరించారు.

Updated Date - Jan 07 , 2025 | 12:05 AM