గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి
ABN, Publish Date - Jan 16 , 2025 | 11:27 PM
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం గురువారం రాత్రి గడిసింగాపూర్ దగ్గర జరిగింది.
పరిగి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం గురువారం రాత్రి గడిసింగాపూర్ దగ్గర జరిగింది. దోమ మండలం కుమ్మరికుంటతండాకు చెందిన సుభా్‌షనాయక్(31) గురువారం రాత్రి పరిగి మండలం గడిసింగాపూర్ దగ్గర రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో సుభా్‌షనాయక్ తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈమేరకు పరిగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Jan 16 , 2025 | 11:27 PM