ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN, Publish Date - Jan 11 , 2025 | 11:43 PM

బైక్‌ ఢీకొని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతిచెందింది. ఈ ఘటన కులకచర్ల మండలంలోని పుట్టపహాడ్‌లో చోటుచేసుకుంది.

కులకచర్ల, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): బైక్‌ ఢీకొని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతిచెందింది. ఈ ఘటన కులకచర్ల మండలంలోని పుట్టపహాడ్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొల్ల వెంకటయ్య పెద్ద భార్య బందెమ్మ(55) శుక్రవారం సాయంత్రం పొలం నుంచి ఇంటికి అనంతసాగర్‌, పుట్టపహడ్‌ దారిలో నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో అనంతసాగర్‌ గ్రామానికి చెందిన వడ్డె నవీన్‌ బైక్‌పై అతివేగంగా వచ్చి బందెమ్మను ఢీకొట్టాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను పాలమూర్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ శనివారం మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జైపాల్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Jan 11 , 2025 | 11:43 PM