ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కారును ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

ABN, Publish Date - Jan 22 , 2025 | 12:10 AM

కారును ట్రావెల్స్‌ బస్సు ఢీకొన్న ఘటనలో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సీఐ నరేందర్‌రెడ్డి కథనం మేరకు గచ్చిబౌలికి చెందిన అనిల్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కారులో మంగళవారం ఉదయం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

తప్పిన పెను ప్రమాదం.. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

శంషాబాద్‌ రూరల్‌, జనవరి 21(ఆంధ్రజ్యోతి): కారును ట్రావెల్స్‌ బస్సు ఢీకొన్న ఘటనలో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సీఐ నరేందర్‌రెడ్డి కథనం మేరకు గచ్చిబౌలికి చెందిన అనిల్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కారులో మంగళవారం ఉదయం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులను ఎయిర్‌పోర్టులో దింపిన అనంతరం డ్రైవర్‌ అభిషేక్‌ తిరిగి ఇంటికి వెళ్తుండగా తొండుపల్లి టోల్‌గేట్‌ వద్దకు వెళ్లగానే వెనకల నుంచి జీఎంఆర్‌ ట్రావెల్స్‌ బస్సు కారును బలంగా ఢీకొంది. దాంతో కారు నుజ్జునుజ్జుయింది. డ్రైవర్‌ అభిషేక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులోని ప్రయాణికులు ఒక్కసారి భయందోళనకు గురై ఎమర్జెన్సీ అందాలు పగులగొట్టి కిందికి దూకారు. అక్కడున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవర్‌ను శంషాబాద్‌లోని ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ పరిస్దితి మిషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. రెండు వాహనాలు రోడ్డుపైనే ఉండడంతో భారీగా ట్రాఫిక్‌ జామయింది. ట్రాఫిక్‌ పోలీసులు ఆ వాహనాలను పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలో అతడిని అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు.

Updated Date - Jan 22 , 2025 | 12:10 AM