ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విషాదం మిగిల్చిన విహారయాత్ర

ABN, Publish Date - Jan 10 , 2025 | 12:17 AM

వేవ్‌పూల్‌లో ఆడుతుండగా ప్రమాదవశాత్తు ఓ బాలుడు మృతిచెందాడు. నగరంలోని శాలిబండకు చెందిన రఫియా, గులాం రసూల్‌ అన్సారీల కుమారుడు ఫైజన్‌ అన్సారీ(11) జాన్హుమాలోని మదీనా మిషన్‌ హైస్కూల్‌లో 6వ తరగతి చదువుతున్నాడు.

వేవ్‌పూల్‌లో విద్యార్థి మృతి

శంకర్‌పల్లి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): వేవ్‌పూల్‌లో ఆడుతుండగా ప్రమాదవశాత్తు ఓ బాలుడు మృతిచెందాడు. నగరంలోని శాలిబండకు చెందిన రఫియా, గులాం రసూల్‌ అన్సారీల కుమారుడు ఫైజన్‌ అన్సారీ(11) జాన్హుమాలోని మదీనా మిషన్‌ హైస్కూల్‌లో 6వ తరగతి చదువుతున్నాడు. గురువారం ఉపాధ్యాయులు 60మంది విద్యార్థులను తీసుకొని శంకర్‌పల్లి మండలం పర్వేద గ్రామ శివారులోని ఫామ్‌ఎక్సోటికా(వైల్డ్‌ వాటర్‌)కు విహారయాత్రకు వచ్చారు. వైల్డ్‌వాటర్‌లోని అలలతో కూడిన వేవ్‌ పూల్‌లో అడుకుంటూ నీట మునిగి స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే సహచర విద్యార్థులు ప్రమాదానికి గురైన అన్సారీని బయటకి తీసుకొచ్చారు. ఫామ్‌ఎక్సోటికా సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు వెంటనే చికిత్స నిమిత్తం శంకర్‌పల్లిలోని లైఫ్‌కేర్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబీకులకు సమాచారం అందడంతో వెంటనే బాలుడి తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చారు. విహారయాత్రకు వెళ్లిన కుమారుడి అకాల మరణంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివా్‌సగౌడ్‌ తెలిపారు.

Updated Date - Jan 10 , 2025 | 12:17 AM