ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బైక్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తి దుర్మరణం

ABN, Publish Date - Jan 09 , 2025 | 11:38 PM

బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఓవ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన కొడంగల్‌లో జరిగింది. ఎ

కొడంగల్‌/కొడంగల్‌ రూరల్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఓవ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన కొడంగల్‌లో జరిగింది. ఎస్‌ఐ జీవి.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొడంగల్‌ పట్టణానికి చెందిన బుగ్గప్ప (50) గురువారం ఉదయం బైక్‌పై శాంతినగర్‌ కాలనీ నుంచి అంబేడ్కర్‌ చౌరస్తాకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో లాహోటీ కమాన్‌ దగ్గర మలుపులో రావుల్‌పల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బుగ్గప్ప లారీ ముందు టైర్‌ల కిందికి వెళ్లడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య శేఖరమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jan 09 , 2025 | 11:38 PM