Union Minister Kishan Reddy : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్ ప్రశంసలు
ABN, Publish Date - Feb 04 , 2025 | 05:16 AM
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ రాజ్యసభ సాక్షిగా ప్రశంసల వర్షం కురిపించారు. బొగ్గు, గనుల రంగంలో సమర్థత, పారదర్శకత తీసుకొచ్చేందుకు మంత్రి కిషన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. అనుమతుల ఆమోదం సులువుగా జరిగేందుకు బొగ్గు, గనుల శాఖ తీసుకొచ్చిన
బొగ్గు, గనుల శాఖలో సమర్థత, పారదర్శకత తెచ్చే
కార్యక్రమాలు చేపడుతున్నారని కితాబు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ రాజ్యసభ సాక్షిగా ప్రశంసల వర్షం కురిపించారు. బొగ్గు, గనుల రంగంలో సమర్థత, పారదర్శకత తీసుకొచ్చేందుకు మంత్రి కిషన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. అనుమతుల ఆమోదం సులువుగా జరిగేందుకు బొగ్గు, గనుల శాఖ తీసుకొచ్చిన సింగిల్ విండో వ్యవస్థను మెచ్చుకున్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాజ్యసభ సభ్యుడు దినేశ్ శర్మ బొగ్గు గనుల శాఖలో సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థపై సోమవారం అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా బొగ్గు, గనుల శాఖలో జరుగుతున్న మార్పుల గురించి సభకు వివరించారు. గనుల కార్యకలాపాల్లో డిజిటలైజేషన్ జరుగుతోందని, దీంతో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని చెప్పారు. వేలం వ్యవస్థను తీసుకొచ్చినప్పటి నుంచి వేలం లేకుండా ఒక్క గని కూడా ఎవరికీ కేటాయించలేదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి ప్రసంగం అనంతరం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడుతూ.. ‘‘సింగిల్ విండో కోల్ వ్యవస్థ చాలా అద్భుతం. గనులు మన సహజ సంపద. ఈ విషయంలో మంత్రిని అభినందించొచ్చు.’’ అని కొనియాడారు.
‘ఎక్స్’ వేదికగా కేంద్రమంత్రి కృతజ్ఞతలు
‘‘గౌరవనీయులైన ఎంపీ రాజ్యసభలో ఇవాళ అడిగిన ప్రశ్నకు.. బొగ్గు, గనుల రంగంలో పారదర్శకత పెంపొందించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించాను. గనుల రంగంలో సింగిల్ విండో వ్యవస్థను కొనియాడిన గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ గారికి కృతజ్ఞతలు. ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గనుల రంగంలో సమర్థత, పారదర్శకత తెచ్చేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం.’’ అని కిషన్‌రెడ్డి ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR: రాష్ట్రంలో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. వేటు తప్పదా..
Gun Firing Case: రూ.333 కోట్లు.. వంద మంది యువతులే టార్గెట్.. వెలుగులోకి ప్రభాకర్ నేరాలు
Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకు కేటీఆర్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Feb 04 , 2025 | 05:16 AM