ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pharm-D Student : విద్యుదాఘాతంతో ఫామ్‌ డీ విద్యార్థి మృతి

ABN, Publish Date - Jan 07 , 2025 | 05:37 AM

విద్యుదాఘాతంతో డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ(ఫామ్‌-డీ) విద్యార్థి మృతి చెందిన సంఘటన వరంగల్‌ జిల్లాలో జరిగింది. హాస్టల్‌ విద్యార్థులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా

వరంగల్‌ జిల్లా మగ్దుంపురం ప్రైవేట్‌ హాస్టల్‌లో ఘటన

వార్డెన్‌ నిర్లక్ష్యమే కారణమంటున్న సహ విద్యార్థులు

నర్సంపేట టౌన్‌, జనవరి6(ఆంధ్రజ్యోతి): విద్యుదాఘాతంతో డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ(ఫామ్‌-డీ) విద్యార్థి మృతి చెందిన సంఘటన వరంగల్‌ జిల్లాలో జరిగింది. హాస్టల్‌ విద్యార్థులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా వున్నాయి. నిర్మల్‌ జిల్లా తానూర్‌ మండలం ఎల్వి గ్రామానికి చెందిన కొండల్‌వాడీ దత్తారెడ్డి-లక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు కొండల్‌వాడీ అవినా్‌షరెడ్డి(18) నర్సంపేట మండలం మగ్దుంపురంలోని జయముఖి ఇంజనీరింగ్‌ కళాశాలలో డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ మొద టి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల ఎదురుగా ఉన్న ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం హాస్టల్‌ వార్డెన్‌ హాస్టల్‌ భవనంపైనున్న ట్యాంక్‌లోకి నీరు రావడం లేదని మోటార్‌లో నీరు పోయాలని అవినా్‌షరెడ్డిని పురమాయించి కరెంట్‌ స్విచ్‌ ఆన్‌చేసేందుకు వెళ్లాడు. నీళ్లు పోస్తుండగా మోటార్‌ పైపు పక్కనే విద్యుత్‌ వైరుకు అవినా్‌షరెడ్డి ఎడమచేయి తగిలి విద్యుత్‌షాక్‌కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే హాస్టల్‌ నిర్వాహకుడు నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆస్పత్రి వైద్యులు అవినా్‌షరెడ్డికి వైద్యపరీక్షలు చేసి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. హాస్టల్‌ వార్డెన్‌ నిర్లక్ష్యం వల్లే అవినా్‌షరెడ్డి మృతి చెందాడని, వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు.

Updated Date - Jan 07 , 2025 | 05:37 AM