ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

21న నల్లగొండలో రైతు మహాధర్నా

ABN, Publish Date - Jan 19 , 2025 | 12:02 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విఽధానాలను నిరసిస్తూ ఈనెల 21వ తేదీన నల్లగొండలోని గడియారం సెంటర్‌లో రైతు మహాధర్నాను నిర్వహిస్తున్నట్టు నల్లగొండ జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌, రాజ్యసభ మాజీ సభ్యుడు, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్‌, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తెలిపారు.

హాజరుకానున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

ఉమ్మడి జిల్లా నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలి

మూడు జిల్లాల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుల పిలుపు

నల్లగొండ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విఽధానాలను నిరసిస్తూ ఈనెల 21వ తేదీన నల్లగొండలోని గడియారం సెంటర్‌లో రైతు మహాధర్నాను నిర్వహిస్తున్నట్టు నల్లగొండ జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌, రాజ్యసభ మాజీ సభ్యుడు, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్‌, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తెలిపారు. శనివారం బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో జడ్పీ మాజీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్‌, గాదరి కిషోర్‌, నోముల భగత్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాధర్నాకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి జగదీ్‌షరెడ్డి రానున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీ పేరుతో మోసం చేసిందని, రైతుభరోసా రూ.15వేలకు హామీ ఇచ్చి రూ.12వేలకు తగ్గించిందన్నారు. వ్యవసాయరంగంతో పాటు గృహాలకు విద్యుత్‌ కోతలు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సమస్య తీవ్రంగా ఉందన్నారు. త్రీఫేస్‌ విద్యుత్‌ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడో పోతుందో తెలియడం లేదని, యాసంగికి యూరియా కొరత మొదలైందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాయాంలో రైతులను రాజును చేయాలని చూస్తే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులను దగా చేస్తోందన్నారు. బీఆర్‌ఎ్‌సకు అధికారం ముఖ్యం కాదని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాము ముందుకు పోతామన్నారు. రేవంత్‌ సర్కారు రైతులను మోసం చేసిందని 420 హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై దాడులు చేసేలా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, నిరంజన్‌ వలీ, కటికం సత్తయ్యగౌడ్‌, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్‌, రావుల శ్రీనివా్‌సరెడ్డి, తండు సైదులు గౌడ్‌, కొండూరు సత్యనారాయణ, దేప వెంకట్‌రెడ్డి, అయితగోని యాదయ్య, జమాల్‌ ఖాద్రీ, మైనం శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 19 , 2025 | 12:02 AM