ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సొంత స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మిస్తాం

ABN, Publish Date - Jan 27 , 2025 | 01:33 AM

భూమిలేని నిరుపేదలకు తన సొంత భూమి ఎకరం స్థలంలో ఇళ్లు నిర్మించి ఇస్తానని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం మండలంలోని సైదాపురం గ్రామం లో సంక్షేమ పథకాల మం జూరు పత్రాలను అందజేసి మాట్లాడారు.

ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట రూరల్‌, జనవరి 26, (ఆంధ్రజ్యోతి): భూమిలేని నిరుపేదలకు తన సొంత భూమి ఎకరం స్థలంలో ఇళ్లు నిర్మించి ఇస్తానని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం మండలంలోని సైదాపురం గ్రామం లో సంక్షేమ పథకాల మం జూరు పత్రాలను అందజేసి మాట్లాడారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతీ ఒక్కరికి అందజేస్తామన్నారు. సైదాపురం గ్రామాన్ని ఆలేరు నియోజకవర్గంలోనే మోడల్‌ విలేజ్‌గా తీర్చిదిద్దుతానన్నారు. ఆలేరులో కరు వు రాకుండా ఉండటానికి గోదావరి జలాలతో 120 చెరువులను నింపి భూగర్భజలాలు పెంచడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, మండల ప్రత్యేక అధికా రి సబిత, హౌసింగ్‌ డీఈఈ శ్రీరాములు, ఏఈ కోటయ్య, తహసీల్దార్‌ జి. దేశ్యనాయక్‌, ఎంపీడీవో నవీన్‌కుమార్‌, ఎంపీవో సలీం, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, సర్పంచ్‌ బీర్ల శంకర్‌, ఉప సర్పంచ్‌ దుంబాల సురేఖ వెంకట్‌రెడ్డి, శిఖ ఉపేందర్‌గౌడ్‌, పార్టీ మండల అధ్యక్షుడు కాను గు బాలరాజ్‌గౌడ్‌, పంచాయతీ అధికారి రోజ, సీస అశోక్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

వీడ్కోలు పదవులకే తప్ప.. ప్రజా సేవకు కాదు

వీడ్కోలు పదవులకే తప్ప.. ప్రజాసేవకు కాదని బీర్ల అయిలయ్య అన్నారు. స్థానిక మునిసిపల్‌ పాలవర్గం వీడ్కోలు సమావేశానికి హాజ రై మాట్లాడారు. చైర్‌పర్సన్‌ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్‌, కమిషనర్‌ అజయ్‌కుమార్‌రెడ్డిల ను అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఐనాల చైతన్యరెడ్డి, కమిషనర్‌ అజయ్‌కుమార్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ కాటంరాజు, కౌన్సిల ర్లు గుండ్లపల్లి వాణీభరత్‌గౌడ్‌, ముక్కెర్ల మల్లేశ్‌యాదవ్‌, బబ్బూరి మౌనికశ్రీధర్‌, బూడిద సురేందర్‌, సీస విజలక్ష్మీకృష్ణగౌడ్‌, గౌళికార్‌ అరుణరాజేష్‌, తాళ్లపల్లి నాగరాజు, దండేబోయి న అనిల్‌, ఆవుల మమతసాయి, బిట్టు సరోజహరీష్‌, కో ఆప్షన్‌ సభ్యులు పేరబోయిన పెంట య్య, ఎస్‌డి. బాబా, గోర్ల పద్మ పాల్గొన్నారు.

ప్రజా పాలన వచ్చింది

ఆత్మకూరు(ఎం): రాష్ట్రాన్ని అధోగతి పా లు చేసిన పదేళ్ల బీఆర్‌ఎస్‌ గడీల పాలన పో యి, ప్రజలు కోరుకున్న ప్రజాపాలన వచ్చింద ని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు.మండలంలోని తిమ్మాపురం లో సంక్షేమ పథకాల మంజూరు పత్రాలను అందజేసి మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను ఏడాది పాలనలో అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికి దక్కిందన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రాజారామ్‌, తహసీల్దార్‌ వి.రవికుమార్‌, ఎంపీడీవో రాములునాయక్‌, మాజీ జడ్పీటీసీ నరేందర్‌, మాజీ ఎంపీపీ మంగమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 27 , 2025 | 01:33 AM