బాధితులకు సత్వర న్యాయం అందజేయాలి
ABN, Publish Date - Jan 24 , 2025 | 12:45 AM
బాధితులకు సత్వర న్యాయం అందజేయాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ గోవర్థనరెడ్డి అన్నారు.
సూర్యాపేటలీగల్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): బాధితులకు సత్వర న్యాయం అందజేయాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ గోవర్థనరెడ్డి అన్నారు. ప్రమోషనపై హైకోర్టు రిజిస్టార్‌గా బదిలీపై వెళ్తున్న ఆయన్ను బార్ అసోసియేషన సభ్యులు గురువారం కోర్టు హాల్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవస్థలో సమన్వయంతో పనిచేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కార్యక్రమంలో మొదటి జిల్లా అదనపు జడ్జి శ్యాంశ్రీ, డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెకట్రీ పీ శ్రీవాణి, సీనియర్ సివిల్ జడ్జి ఫరీన కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, బార్ అసోసియేషన అధ్యక్షుడు నూకల సుదర్శనరెడ్డి, ప్రధాన కార్యదర్శి డప్పుకు మల్లయ్య, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 24 , 2025 | 12:45 AM