ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రిటైర్మెంట్‌ వయస్సు పెంపును విరమించుకోవాలి

ABN, Publish Date - Feb 01 , 2025 | 12:30 AM

రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు పెంపుదలను విరమించుకోవాలని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు అన్నారు.

జీవో3 ప్రతులను దహనం చేస్తున్న తెలంగాణ యువజన సంఘం నాయకుడు మధు, నాయకులు

సూర్యాపేట టౌన, జనవరి 31 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు పెంపుదలను విరమించుకోవాలని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు అన్నారు. యూనివర్సిటీల్లోని ప్రొఫెసర్ల రిటైర్మెంట్‌ వయస్సును 60 ఏళ్ల నుండి 65 ఏళ్లకు పెంచుతూ విడుదల చేసిన జీవో నెంబర్‌ 3 ప్రతులను శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద దహనం చేసి, మాట్లాడారు. యూనివర్సిటీ అధ్యాపకుల పదవీ విరమణ వయస్సు పెంచడం సరికాదని, రాష్ట్రవ్యాప్తంగా 11 యూనివర్సిటీల్లో సుమారు 2000 అధ్యాపక పోస్టులను భర్తీ చేయకుండా వివిధ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న సీనియర్‌ అధ్యాపకులను వినియోగించుకునే పేరుతో పదవీ విరమణ వయస్సు పెంచడం దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు అన్యాయం చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో నాయకులు బాషిపంగు సునీల్‌, పోరెళ్ల విప్లవ్‌కుమార్‌, పంతం యాకయ్య, ధరావత వెంకటే్‌షనాయక్‌, కోడి సురేష్‌, కొలికపంగు వాసు, చామకూరి మహేందర్‌, రాహుల్‌ నాయక్‌, శ్యాం, రోషణ్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2025 | 12:30 AM