కోఆపరేటివ్ బ్యాంకులకు ఆదర్శంగా సుధా బ్యాంక్
ABN, Publish Date - Jan 21 , 2025 | 12:29 AM
రాష్ట్రంలోనే అన్ని కోఆపరేటివ్ బ్యాంకులకు ఆదర్శంగా సుధా బ్యాంక్ నిలిచిందని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన పటేల్ రమే్‌షరెడ్డి అన్నారు.
సూర్యాపేట టౌన, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే అన్ని కోఆపరేటివ్ బ్యాంకులకు ఆదర్శంగా సుధా బ్యాంక్ నిలిచిందని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన పటేల్ రమే్‌షరెడ్డి అన్నారు. సుధాబ్యాంక్ ఏర్పడి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలో నిర్వహించిన రజతోత్సవాల్లో ఆయన మాట్లాడారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, మీలా సత్యనారాయణ ప్రారంభించిన సుధా కోఆపరేటివ్ బ్యాంక్ రాష్ట్రంలో ఏడు బ్రాంచలను ఏర్పాటుచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోందన్నారు. చిన్నచిన్న వ్యాపారులకు, ప్రజలకు నేషనల్ బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ఎన్నో షరతులు పెడుతున్న రోజుల్లో సామాన్యులకు రుణాలు ఇచ్చి వారిని ప్రోత్సహించిన చరిత్ర సుధా బ్యాంక్‌కు ఉందన్నారు. సుధా బ్యాంక్ సేవలు మరింతగా విస్తరించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సుధా బ్యాంక్ చైర్మన మీలా మహదేవ్, ఎండీ పెద్దిరెడ్డి గణేష్, మణిశర్మ, తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అర్బన బ్యాంక్స్ రాష్ట్ర అధ్యక్షుడు వేమిరెడ్డి సర్సింహారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మదనగోపాలస్వామి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి రాజా, భువనగిరి భాస్కర్, మీలా సందీప్, కక్కిరేణి చంద్రశేఖర్, పొనుగోటి నిర్మల, ఏపూరి శ్రవణ్‌కుమార్, సుజాత, గిల్లి అంజనప్రసాద్‌లతో పాటు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jan 21 , 2025 | 12:29 AM